Sunday, November 17, 2024

ఫైబర్‌ నెట్‌ ‘ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో’కు విశేష స్పందన.. త్వరలో ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌

అమరావతి, ఆంధ్రప్రభ : ఫైబర్‌ నెట్‌ సెటప్‌ బాక్స్‌లను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామని ఫైబర్‌ నెట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ డా. పి. గౌతమ్‌ రెడ్డి వెల్లడించారు. బుధవారం గౌతమ్‌ రెడ్డి అధ్యక్షతన ఏపీ ఫైబర్‌ కేబుల్‌ రాష్ట్ర ఎంఎస్‌వో, ఎల్‌సీవోలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ, ఫైబర్‌ నెట్‌ ఆధ్వర్యంలో తలపెట్టిన ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోకు ప్రేక్షకుల స్పందన బాగుందన్నారు.

త్వరలో ఫైబర్‌ నెట్‌ ద్వారా ఓటీటీ ప్లాట్‌ ఫామ్స్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఎంఎస్‌వోలకు రాయితీలు ఇచ్చే అంశాన్ని ఆలోచిస్తున్నామన్నారు. ప్రైవేట్‌ సంస్థల కంటే ధీటుగా ప్రజలకు ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలు అందిస్తున్నామని స్పష్టం చేశారు. మారుమూల గ్రామాల్లోని ప్రజలందరికీ బీఎస్‌ఎన్‌ఎల్‌ సహకారంతో ఇంటర్నెట్‌ అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.

- Advertisement -

సెటప్‌ బాక్స్‌ల ధర ఎంత నిర్ణయించాలి, ఎన్ని సెటప్‌ బాక్స్‌లు కొనాలన్న అంశంపై ఎమ్‌ఎస్‌వోలు, అధికారు లతో చర్చిస్తున్నామన్నారు. కొత్త బాక్స్‌లు కొనాలని ఆలోచన చేస్తున్నామన్నారు. వారంలో ఈఅంశంపై తుది నిర్ణయం వెలువడుతుందన్నారు.

అవసరమైతే ప్రజలందరికీ తక్కువ ధరకు సెటప్‌ బాక్స్‌లు అందజేస్తామని గౌతమ్‌ రెడ్డి అన్నారు.
ఈసమావేశంలో ఏపీ స్టేట్‌ ఫైబర్‌ నెట్‌ ఎండీ ఎం.మధు సూధన్‌ రెడ్డి, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చిన ఎమ్‌ ఎల్‌ వోలు, ఎల్‌ సీవోలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement