అమరావతి, ఆంధ్రప్రభ: హైదరాబాద్- తిరుపతి, కాచిగూడ- నర్సాపూర్ , నర్సాపూర్- తిరుపతి, తిరుపతి- కాచిగూడ మార్గాల్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 30 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07643 హైదరాబాద్- తిరుపతి(సోమవారాల్లో) ఈ నెల 25, ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 7.30కు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం పది గంటలకు తిరుపతి చేరుతుంది. 07644 తిరుపతి- హైదరాబాద్(మంగళవారాల్లో) ఈ నెల 26, ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం ఐదు గంటలకు హైదరాబాద్ చేరుతుంది.
07612 కాచిగూడ- నర్సాపూర్(సోమవారాల్లో) ఈ నెల 25, ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీల్లో రాత్రి 11 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం పదిన్నరకు నర్సాపూర్ చేరుతుంది. 07613 నర్సాపూర్- తిరుపతి(మంగళవారాల్లో) ఈ నెల 26, ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 8.45కి బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుతుంది. 07614 తిరుపతి- కాచిగూడ(బుధవారాల్లో) ఈ నెల 27, ఆగస్టు 3, 10, 17, 24, 31 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలక బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాచిగూడ చేరుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.