Tuesday, November 19, 2024

ఏపీ ప్రయాణికులు అలర్ట్: పట్టాలెక్కిన ప్రత్యేక రైళ్లు

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తగ్గడంతో రైల్వేశాఖ మళ్లీ సర్వీసులను పట్టాలెక్కిస్తోంది. తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నారు. పలు రూట్లలో తాత్కాలికంగా రద్దు చేసిన ప్రత్యేక సర్వీసులను తిరిగి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 02603 చెన్నై సెంట్రల్‌ – హైదరాబాద్‌ ట్రైన్‌ను గురువారం నుంచి, 02604 హైదరాబాద్‌-చెన్నై సెంట్రల్‌ ట్రైన్‌ను ఈ నెల 18 నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.

మరోవైపు లింగంప‌ల్లి-విజ‌య‌వాడ ఇంట‌ర్‌సిటీ రైలును ద‌క్షిణ‌మ‌ధ్య రైల్వే పున‌రుద్ధ‌రించారు. క‌రోనా నేప‌థ్యంలో జూన్ 2న అధికారులు ఈ స‌ర్వీసును ర‌ద్దుచేశారు. అయితే నేటి నుంచి రైలు స‌ర్వీసును మ‌ళ్లీ ప్రారంభించారు. ఉద‌యం 4.40 గంట‌ల‌కు బ‌య‌లుదేరిన ఈ ఇంట‌ర్‌సిటీ రైలు (02796) 10.30 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌కు చేరుకుంటుంది. మ‌ళ్లీ సాయంత్రం 5.30కి విజ‌య‌వాడ‌లో బ‌య‌లుదేరి రాత్రి 11.20 గంట‌ల‌కు లింగంప‌ల్లికి చేరుకుంటుంది. అమ‌రావ‌తిలోని సెక్ర‌టేరియ‌ట్‌లో ప‌నిచేసే ఉద్యోగులు అత్య‌ధికంగా ఈ రైలులో ప్ర‌యాణిస్తూ ఉంటారు. కాగా, బుధవారం నుంచి కాచిగూడ – రేపల్లె డెల్టా ఎక్స్‌ప్రెస్, తుంగభద్ర ఎక్స్‌ప్రెస్‌, గుంటూరు-కాచిగూడ-గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: టిక్కెట్ లేకుండా రైలు ఎక్కే సౌలభ్యం

Advertisement

తాజా వార్తలు

Advertisement