విశాఖపట్నం – ఒక వైపు దసరా సెలవులు.. మరో వైపు వర్షాల సీజన్ ముగియవచ్చింది.. ఇక, ఇప్పటికే అరకు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి.. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. మంచు కురుస్తోంది.. ఈ సమయంలో ఎవరైనా అరకు పర్యటనకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు.. ఇప్పుడు దసరా సెలవులు కూడా తోడు కావడంతో పర్యాటకులను ఆకర్షించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది రైల్వేశాఖ.
పర్యాటకుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్టు ప్రకటించింది.. అక్టోబర్ 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అరకుకు ప్రత్యేక రైలు నడపనుంది రైల్వే శాఖ. దసరా సీజన్ సందర్భంగా పర్యాటకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అరకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు పేర్కొంది.. రైల్వేశాఖ తీసుకొస్తున్న ఈ ప్రత్యేక రైలు 5వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య ప్రతీ రోజు ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాలకు విశాఖలో బయలుదేరి 11 గంటల 30 నిమిషాలకు అరకు చేరుకోనున్న ప్రత్యేక రైలు.. తిరిగి మధ్యాహ్నం రెండు గంటలకు అరకు నుంచి ఈ రైలు బయలుదేరి సాయంత్రం ఆరు గంటలకు విశాఖ చేరుతుందని న ప్రకటనలో పేర్కొంది రైల్వేశాఖ..