అమరావతి, ఆంధ్రప్రభ: ఉగాది పండుగ సెలవుల రద్దీ దృష్ట్యా పలు రూట్లలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 07593, 94 కాకినాడ టౌన్- సికింద్రాబాద్ ఈ నెల 31, ఏప్రిల్ 1న ఇరు వైపు ప్రయాణంలో రాత్రి 8.45కు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7.10, 8.40కి గమ్యం చేరుతుంది. 07595 కాకినాడ టౌన్- తిరుపతి ఏప్రిల్ 2న రాత్రి 9 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7.30కు తిరుపతి చేరుతుంది. 07596 తిరుపతి- సికింద్రాబాద్ ఏప్రిల్ 3న రాత్రి 7.50 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. 07591 గుంటూరు- హుబ్బలి 3, 4 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు 7.10కి, 07592 హుబ్బలి- గుంటూరు 4న ఉదయం 9.25కి బయలుదేరి తర్వాతి రోజు అర్థరాత్రి 12.30కు గుంటూరు చేరుతుంది.
07597 సికింద్రాబాద్- తిరుపతి ఒకటో తేదీ రాత్రి 8.15కు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7.50కి, 07598 తిరుపతి- కాకినాడ టౌన్ 2న రాత్రి 9.55కి బయలుదేరరి తర్వాతి రోజు ఉదయం 8.45కి, 07599 కాకినాడ టౌన్- వికారాబాద్ 3న రారత్రి 8.45కి బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 9.30కు, 07095 మచిలీపట్నం- తిరుపతి ఒకటో తేదీన సాయంత్రం 6.25కు బయలుదేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు, 07096 తిరుపతి- మచిలీపట్నం 2 రాత్రి 10.15కి బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 7.45కి మచిలీపట్నం చేరుతుంది. అలాగే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ రూట్లలో ప్రయాణించే పలు రైళ్లకు అదనపు బోగీలు జోడించి నడపనుంది.