అమరావతి, ఆంధ్రప్రభ: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా నాలుగు స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్ నెం 07433 సికింద్రాబాద్- తిరుపతి ఈ నెల15న రాత్రి 7.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు, 07434 తిరుపతి- సికింద్రాబాద్ 16వ తేదీన రాత్రి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. అలాగే 07082 నాందేడ్- విశాఖపట్నం 15న సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు, 07083 విశాఖపట్నం- నాందేడ్ 17న సాయంత్రం 6.20 గంటల నుంచి బయలుదేరి మరుసటి రోజు 3.10 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్ల మధ్య ఆగుతుంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..