Friday, November 22, 2024

Special Trains | విశాఖ-విజయవాడ మధ్య 16 ప్రత్యేక రైళ్లు.. వివరాలివే !

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే విజయవాడ-విశాఖ మార్గంలో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్రత్యేక రైళ్లు నేటి (నవంబర్ 1) నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ వివరాలను పేర్కొంది.

విశాఖ – విజయవాడ జన్‌సాధారణ్‌ ఎక్స్‌ప్రెస్‌ (08567) రైలు నవంబర్‌ 1,3,4,6,8,10,11,13 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇది విశాఖపట్నం ఉదయం 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ-విశాఖ ప్రత్యేక రైలు (08565) విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరుతుంది. రాత్రి 12.35 గంటలకు విశాఖ చేరుకోనుంది.

మొత్తం ఎనిమిది సర్వీసులు విజయవాడవైపునకు రాగా.. మరో 8 సర్వీసులు విశాఖపట్నం వైపు వెళ్తాయి. మొత్తం 16 ప్రత్యేక సర్వీసులు రాకపోకలు కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement