Thursday, November 21, 2024

స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు రంగంలోకి స్పెష‌ల్ పార్టీ పోలీసులు

తిరుపతి సిటీ : తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గురువారం సహాయక‌ చర్యలు చేప‌ట్టేందుకు తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ వెంకటప్ప నాయుడు స్పెషల్ పార్టీ పోలీసుల బృందాలను ఏర్పాటు చేశారు. ఎక్కడ అవసరమైతే అక్కడకు పంపించేందుకు సిద్ధం చేశారు. తిరుపతి అర్బన్ పోలీస్ జిల్లా పరిధిలో సంబంధిత అధికారులకు సెట్ కాన్ఫరెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి, జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ మైక్ సెట్ ద్వారా రెవిన్యూ, ఇతర అధికారుల సహాయ సహకారాలతో ముమ్మర చర్యలు చేపడుతున్నారు. మరోపక్క జోరువానను సైతం లెక్కచేయకుండా స‌హాయ‌క చ‌ర్య‌లు చేపడుతున్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ఎవరూ బయటకు రావద్దని, ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు కావాల‌న్నా పోలీసు వారిని సంప్రదించాలని కోరారు. 100కు డ‌య‌ల్ చేసి పోలీస్ ల‌ను సంప్రదించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement