Monday, November 18, 2024

Amaravathi – అనాలోచిత పాలనతో శిథిలావస్థకు రాష్ట్ర‌ రాజధాని – స్పీకర్‌ అయ్యన్న


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, విజ‌య‌వాడ‌: ఓ నాయకుడు అనాలోచిత పాలన వల్ల అమరావతి రాజధాని శిథిలావస్థకు చేరిందని ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. శుక్రవారం రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటించారు. అసంపూర్తిగా ఉన్న మీడియా, గ్రంథాలయం, డైనింగ్ హాళ్లను పరిశీలించి వెంటనే పూర్తి చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించారు అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం కనీసం అసెంబ్లీ భవనాలకు సున్నం కూడా వేయించలేక పోయిందని విమర్శించారు.

జ‌గ‌న్ స‌ర్కారు ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల‌నే..

చంద్రబాబు పాలనలో ఏపీ అసెంబ్లీ భవనం, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్లను హైదరాబాద్‌ కంటే బ్రహ్మాండంగా నిర్మించారని స్పీక‌ర్ అయ్య‌న్న‌ అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడం వల్ల భవన సామగ్రిని దొంగిలించారని ఆరోపించారు. ఐదేండ్ల పాటు పనులు చేపట్టకపోవడంతో తిరిగి పనుల పూర్తికి అధనంగా మరో 3వందల కోట్ల ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఇందుకు కావాల్సిన నిధులను సీఎం దృష్టికి తీసుకెళ్లి 9 నెలల్లో్ క్వార్టర్లను సభ్యులకు అందజేసే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. అందరం కలిసి రాజధానిని నిర్మించుకుని ప్రజలకు అంకితమివ్వాలని కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement