ఆమదాలవలస పట్టణంలోని అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం ఆదేశించారు. బుధవారం ఉదయం ఐజె నాయుడు కాలనీ వార్డులో గుడ్ మార్నింగ్ ఆమదాలవలస కార్యక్రమాన్ని నిర్వహించారు. వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మట్ట సావిత్రి అనే ఒంటరి మహిళ పూరిపాకలో నివాసం ఉంటున్ననని వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నానని స్పీకర్ తమ్మినేని దృష్టికి సమస్య తీసుకురాగా హౌసింగ్ పథకంలో ఇల్లు కట్టించి ఇస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. కళ్యాణి రాజేశ్వరి అనే మహిళ పూర్వం నుండి టైలర్ వృత్తిని నమ్ముకొని బ్రతుకుతున్ననని ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయలు చేదోడు పథకం నాకు అందటం లేదని ఫిర్యాదు చేయగా సంబంధిత అధికారులతో మాట్లాడి పథకం వర్తించే విధంగా చూడాలని ఆదేశించారు అదేవిధంగా వీధిదీపాలు కరెంటు స్తంభాలు లేవని కొందరు మహిళలు స్పీకర్ దృష్టికి తీసుకురాగా ఎలక్ట్రికల్ అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గతంలో వేసిన సిసి రోడ్లు పాడయ్యయని, అదేవిధంగా డ్రైనేజీ కాలువలు కూడా కూడిన సిసి రోడ్లు వేయాలని కోరారు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పీకర్ ఆదేశించారు. కాలువ లో ఉన్న పూడికలు తొలగించి అవుట్ లేట్ నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement