Saturday, November 23, 2024

ఆర్‌ఆర్‌బీ పరీక్ష కోసం ప్రత్యేక రైళ్లు..

అమరావతి, ఆంధ్రప్రభ: రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించే ఎన్టీపీసీ పరీక్షల కోసం నాలుగు ఎగ్జామినేషన్‌ స్పెషల్‌ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. రైలు నం. 08013/ 08014 షాలిమార్‌- చీరాల- షాలిమార్‌ పరీక్ష ప్రత్యేక రైళ్లు ఈ నెల 8, పదో తేదీల్లో నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు సంత్రాగచ్చి, ఖరగ్‌పూర్‌, బాలా సోర్‌, భద్రక్‌, జైపూర్‌, కియోంజర్‌ రోడ్‌, కటక్‌, భువనేశ్వర్‌, బ్రహ్మపూర్‌, పలాస, శ్రీకాకుళం రోడ్‌, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో ఇరువైపుల ప్రయాణాల్లో ఆగుతాయి. అలాగే రైలు నం. 08615/ 8616 హటియా- చీరాల- హటియా పరీక్షల ప్రత్యేక రైళ్లు ఈ నెల ఏడు, పదో తేదీల్లో నడుస్తాయి. ఈ ప్రత్యేక రైళ్లు రూర్కెలా, జార్సుగూడ, సంబల్‌పూర్‌, కటక్‌, భువనేశ్వర్‌, బ్రహ్మపూర్‌, పలాస, శ్రీకాకుళం రోడ్‌, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ స్టేషన్లలో(ఇరువైపుల ప్రయా ణాల్లో) ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 3 టైర్‌ ఏసీ, స్లీపర్‌ క్లాస్‌, చైర్‌ కార్‌, జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ బోగీలు ఉంటాయి.

ట్రాక్‌ పనుల కారణంగా పలు రైళ్ల రద్దు..

రైల్వే ట్రాక్‌ పనులు, ట్రాఫిక్‌ బ్లాక్‌ కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ట్రైన్‌ నం. 06746/ 06745 నెల్లూరు- సూళ్లూరు పేట, సూళ్లూరు పేట- నెల్లూరు ఈ నెల 24 నుంచి పూర్తిగా రద్దయింది. ట్రైన్‌ నెం 17227/ 17228 డోన్‌- గుంటూరు, గుంటూరు- డోన్‌ ఈ నెల 9వ తేదీన 2 గంటలు, గంటన్నర ఆలస్యంగా బయలుదేరేలా రీ షెడ్యూల్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement