Wednesday, December 25, 2024

AP | శ్రీశైలంలో జనవరి ఒకటో తేదీన స్పర్శ దర్శనం రద్దు..

నంద్యాల బ్యూరో, డిసెంబర్ 24 : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో రాబోయే ఒకటవ తేదీన దేవాలయంలో స్పర్శ దర్శనం, ఆర్జిత అభిషేకాలు నిలుపుదల చేస్తున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు మంగళవారం తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న కారణంగా గతంలో చేపట్టిన విధానం మేరకే ఈ ఒక్కరోజు మాత్రం ఈ విధంగా చేయడమైనది తెలిపారు. స్పర్శ దర్శనం కాకుండా శ్రీ స్వామి వారి అలంకార దర్శనం ఉంటుందన్నారు.

దీంతో పాటు స్వామివారి ఆర్జిత గర్భాలయ అభిషేకాలు, ఆర్జిత సామూహిక అభిషేకాలతో పాటు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం చేసే సేవలను కూడా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు. స్పర్శ దర్శనం క్యూ లైన్ లోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు సమయానుసారం మంచినీరు, అల్పాహారం ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. అన్నదాన కార్యక్రమంతో పాటు లడ్డూ ప్రసాదు విధాలాపంగా కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసామని భక్తులు ఈ చిన్న మార్పును గమనించాలని ఈవో తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement