తెలంగాణ నుంచి ఏపీకి మూడేళ్ల డిప్యూటిషన్ పై వచ్చిన ఐపీఎస్ ఆఫీసర్ ఎల్.సుబ్బారాయుడు… ఇవ్వాల తిరుపతి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.
కాగా, ఆయన జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే టీటీడీ ఈవో శ్యామలరావును ఆయన ఛాంబర్‌లో కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వారు ఎస్పీ సుబ్బారాయుడికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలు చేపడుతామన్నారు.