అమరావతి, ఆంధ్రప్రభ: ఎండవేడి.. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఆదివారం నుంచి కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఐఎండి సూచనల ప్రకారం రాబోయే రెండు, మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగాడానికి అలాగే రాయలసీమలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకులంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ నెల ఏడో తేదీ నుంచి రుతుపవనాలు మరింత విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఎండల తీవ్రత, ఉక్కపోత, వాతావరణంలో తేమ లేకపోవడంతో గత కొద్ది రోజులుగా జనం అల్లాడిపోతున్నారు. నైరుతి రాకతో జోరువానలు కురుస్తాయన్న వాతావరణశాఖ సూచనలతో ప్రజలు రిలాక్స్ అవుతున్నారు.
కోస్తాంధ్ర ప్రాంతంలో ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో రాగల నాలుగు రోజులు అక్కడక్కడ భారీవర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడనున్నట్లు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించారు.
రానున్న నాలుగు రోజులు వాతావరణం…
02వ తేదీ ఆదివారం
అల్లూరి సీతారామరాజు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
03వ తేదీ సోమవారం
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ , చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తెలిపాటి జల్లులు కురిసే అవకాశం ఉందన్నారు.
04వ తేదీ మంగళవారం
అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
05వ తేదీ బుధవారం
పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.
శని3వారం సాయంత్రం 7 గంటల నాటికి అన్నమయ్య జిల్లా రాజంపేటలో 32.5మిమీ,అనంతపురం జిల్లా గుంతకల్లులో 30.5మిమీ, చిత్తూరు జిల్లా గుడుపల్లెలో 24.2మిమీ, చిత్తూరులో 21మిమీ, తవణంపల్లె 18.7మిమీ,విశాఖ జిల్లా భీమునిపట్నంలో 18.2మిమీ,అల్లూరి జిల్లా కొయ్యురులో 17.7మిమీ, కాకినాడ జిల్లా తొండంగిలో 15.2మిమీచొప్పున వర్షపాతం నమోదైంది.