దేశంలోకి నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. అండమాన్ వద్ద తీరాన్ని తాకడంతో రుతుపవనాల ఆగమనం ప్రారంభమైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో జల్లులు పడుతున్నాయి. రాయలసీమలోని కొన్ని చోట్ల పిడుగులు పడ్డట్టు వార్తలొస్తున్నాయి. కూలీలు, బయట తిరిగే వారు ఉరుములు, మెరుపుల సమయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎత్తైన ప్రదేశాలు, పెద్ద పెద్ద చెట్ల నీడన ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు.
Breaking: దేశంలోకి నైరుతి ఆగమనం.. ఏపీలో కురుస్తున్న వర్షాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement