Friday, November 22, 2024

Special Trains: ఏపీ ప్రయాణికులకు గమనిక.. సంక్రాంతికి మరో 4 ప్రత్యేక రైళ్లు..

తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి శోభకు మరో వారం రోజులు మాత్రమే ఉన్నాయి. ఏపీ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇప్పటికే 10 ప్రత్యేక రైళ్లును ప్రకటించిన.. వీటికి అదనంగా మరో నాలుగు రైళ్లు నడవనున్నాయి. తిరుపతి – సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07460) ఈ నెల 10న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌–తిరుపతి రైలు (82720) 11వ తేదీ సాయంత్రం 7.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరుపతి-కాచిగూడ ప్రత్యేక రైలు (07461) 12న మధ్యాహ్నం 3.20 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. కాచిగూడ–తిరుపతి ప్రత్యేక రైలు (07642) ఈ నెల 13న మధ్యాహ్నం 3.45 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.

పండుగ వేళ తెలుగు రాష్ట్రాల్లో రద్దీని అర్థం చేసుకుని ప్రయాణానికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఇటీవల ప్రకటించిన 10 ప్రత్యేక రైళ్లు.. జనవరి 7వ తేదీ నుంచి 22వ తేదీల మధ్య నడవనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 7, 14వ తేదీల్లో కాచిగూడ-విశాఖపట్నం, 8, 16న విశాఖపట్నం-కాచిగూడ, 11వ తేదీన కాచిగూడ-నర్సాపూర్‌, 12న నర్సాపూర్‌- కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్‌- లింగంపల్లి, 20, 22న లింగంపల్లి – కాకినాడ టౌన్‌ మధ్య స్పెషల్ ట్రైన్లు నడవబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement