ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీవర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. మరికొన్నింటిని దారి మళ్లిచినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. నెల్లూరు- పడుగపాడు మార్గంలో 18 రైళ్లు రద్దు చేయగా, రెండు రైళ్లు తాత్కాలికంగా నిలిపివేశారు. 10 రైళ్లు దారి మళ్లించారు. ఒక రైలు వేళల్లో మార్పు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
రద్దు చేసిన రైళ్ల వివరాలు..
రామేశ్వరం- భువనేశ్వర్(20895), పూరి- చెన్నె సెంట్రల్(22859), పూరి- తిరుపతి(17489), అహ్మదాబాద్- చెన్నై సెంట్రల్ (12655), చెన్నై సెంట్రల్- జైపూర్(12967), నాగర్‌సోల్- తిరువనంతపురం(06426), తిరువనంతపురం- నాగర్‌సోల్(06427), కొల్లాం- తిరువనంతపురం(06425), తిరువనంతపురం- నాగర్‌సోల్ (06435), హౌరా- యశ్వంతపూర్ (12863), చెన్నై సెంట్రల్- హజరత్ నిజముద్దీన్(12269), చెన్నై సెంట్రల్- హౌరా(12842), చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్(12656), చెన్నై సెంట్రల్- విజయవాడ(12712), గువహటి- బెంగళూరు కంటోన్మెంట్(12510), న్యూ తినుసుకియా – తాంబరం(15930), తిరుపతి- హౌరా(20890) రైళ్లను రద్దు చేశారు.