Thursday, December 5, 2024

Sorry – అలిపిరి వద్ద రీల్స్ .. క్షమాపణ కోరిన యువ‌తి ..

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల్లో కొందరు వికృత, వెకిలి చేష్టలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం రెండో ఘాట్‌లో కారులో వెళ్తూ యువకులు బీభత్సం సృష్టించిన సంగతి మరవకముందో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీవారి పాదాల చెంత పూజిత రీల్స్‌ చేయడం వివాదాస్పదంగా మారింది. అలిపిరి టోల్ గేట్ వద్ద పుష్ప-2 మూవీలోని ‘కిస్సిక్’ అనే పాటకు యువతి డాన్స్ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పోస్ట్‌ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

క్షమాపణలు కోరిన పూజిత
అలిపిరి వద్ద రీల్స్ చేయడంపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తడంతో యువతి పూజిత స్పందించింది. టీటీడీ అధికారులకు క్షమాపణలు కోరింది. తెలియక తప్పు చేశానని, మరో సారి ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకుంటానని తెలిపింది. తనలా ఇంకొకరు ఇలాంటి తప్పు చేయొద్దని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement