Tuesday, November 19, 2024

త్వరలో సేంద్రియ మాల్స్‌.. సేంద్రియ కూరగాయలు, వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం

అమరావతి, ఆంధ్రప్రభ: సేంద్రీయ కూరగాయలు మరియు పండ్లను ప్రజలకు, ముఖ్యంగా ఎగువ మధ్యతరగతి వినియోగదారులకు సులభంగా అందు బాటు లో ఉంచాలనే ఉద్దేశ్యంతో మార్కెటింగ్‌ శాఖ సరి కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో వీటిని ప్రత్యేకంగా ఏర్పాటుచేసి అన్ని రకాల సేంద్రియ ఉత్ప త్తులను అమ్మేలా ప్రత్యేక సేంద్రీయ మాల్స్‌ను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్గానిక్‌ మాల్‌ను విశాఖలోని ఎంవీపీ రైతు బజార్‌లో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల నాటికి ఇది కార్యరూపం దాల్చనుంది. అదే సమయంలో విజయనగరం, శ్రీకాకుళంలో కూడా ఇలాంటి మాల్స్‌ ఏర్పాట్లకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 25 ప్రాంతాల్లో దశలవారీగా సేంద్రియ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేక మాల్స్‌ను ఏర్పాటు- చేయాలనే లక్ష్యంతో మార్కెటింగ్‌ శాఖ అడు గులు ముందుకు వేస్తోంది. విశాఖలో మొత్తం 101 యాక్టివ్‌ రైతు బజార్‌లు ఉన్నాయి, వాటిలో దాదాపు 25 రైతు బజార్లను ఆర్గా నిక్‌ మాల్స్‌గా మార్చడానికి అనుకూలమైనవని అది కారులు గుర్తించారు. వీటిలో సేంద్రియ కూర గాయలను విక్రయించేలా సేంద్రియ రైతులతో అక్కడి రైతు బజార్ల అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. తమ సేంద్రీయ ఉత్పత్తులను విక్రయించడానికి ఆసక్తి ఉన్నవారు ఒప్పందం కోసం మమ్మల్ని సంప్రదించవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే 9 మంది రైతులు తమ ఆర్గానిక్‌ ఉత్పత్తులను ఆయా రైతు బజార్లలో అమ్మేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. విశాఖ తర్వాత విజయవాడలో ఆర్గానిక్‌ మాల్‌ ఏర్పాటు కానుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement