పెట్రోల్ ధరలపై ఏపీ ప్రభుత్వం వితండవాదం చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. కేంద్రంతో సమానంగా పెట్రో ధరలు పెంచిన ప్రభుత్వం.. తగ్గించినప్పుడు ఎందుకు తగ్గించడం లేదని నిలదీశారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో రాష్ట్రాలకు రూ. 19 వేల కోట్లే ఇచ్చిందని చెప్పడం దుర్మార్గమని, అసలు కేంద్రం ఎంత ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం పేరిట రూ. 4 సెస్ వసూలు చేస్తూ రాజధానిని ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. అలాగే, రహదారి సెస్ పేరుతో రూ. 2 వసూలు చేస్తూ గోతులు ఎందుకు పూడ్చడం లేదని సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement