బీజేపీకి అధికారం ఇస్తే రూ. 50 రూపాయలకే నాణ్యమైన చీప్ లిక్కరు ఇస్తామని వ్యాఖ్యానించి విమర్శల పాలైన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. పేదల కష్టాన్ని జగన్ ప్రభుత్వం దోచుకుంటోందని, అందుకనే అలా మాట్లాడాల్సి వచ్చిందని అన్నారు. మద్యం కోసం పేదలు రోజూ రూ. 250 వరకు ఖర్చు చేస్తున్నారని, ఆ ఖర్చులో రూ.200 తగ్గితే ఆ కుటుంబంపై భారం తగ్గుతుందన్నారు. ప్రతి నెలా రూ. 6 వేలు ఆదా అవుతుందని సోము వీర్రాజు చెప్పారు.
కాగా, తాము అధికారంలోకొస్తే రూ.50కే చీప్ లిక్కర్ బాటిల్ ఇస్తాం అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మంగళవారం(డిసెంబర్ 28) విజయవాడలో జరిగిన ప్రజాగ్రహ సభలో చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్‌గా మారాయి. మరీ ఇంత ‘చీప్’గా ఎలా మాట్లాడతారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇతర పార్టీ నేతలు, సామాన్యులతోపాటు సొంతపార్టీ కార్యకర్తలు సైతం వీర్రాజు వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణ మంత్రి కేటీఆర్, వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల, సోము వీర్రాజుపై సెటైర్లు వేశారు. సోము వైన్స్.. సారాయి వీర్రాజు అంటూ నెటిజన్లు ఆయనను ట్రోలింగ్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..