ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్నారు. ఈ మేరకు ఈరోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్‌తో ఆయన భేటీ కానున్నారు. కావలి ఎమ్మెల్యే అవినీతిపై సీఎం జగన్ కు ఫిర్యాదు చేయాలని ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారని సోము వీర్రాజు ఆరోపిస్తున్నారు. ఇటువంటి ఘటనలకు పాల్పడే పోలీసులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరనున్నారని తెలుస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement