Wednesday, November 20, 2024

బీజేపీలోకి రఘురామ..’ఏమైనా జరగొచ్చు’!

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు బీజేపీలో చేరేందుకు లైన్ క్లియర్ అయ్యిందా? వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారా ?. తాజా పరిణామాలు ఇది నిజమే అనే సందేహాలు కలిగిస్తోంది. ఎంపీ పదవి రాజీనామా చేసేందుకు సిద్ధమంటూ ఇటీవల ప్రకటించి సంచలన రేపిన రఘురామ.. జగన్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయన బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ అగ్ర నేతలతో టచ్ లో ఉన్నారు. గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఎంపీ రఘురామ భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన కాషాయ కండువా కప్పుకుంటారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఘురామ బీజేపీలో చేరి పోటీ చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సోము వీర్రాజు బదులిస్తూ.. ‘ఏదైనా జరగొచ్చు’ అని నర్మగర్భ వ్యాఖ్యానించారు. దీంతో రఘురామ బీజేపీలో చేరడం దాదాపు ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో తాను గతంలో పోటీ చేసి గెలిచిన నరసాపురం నుంచే తిరిగి మరోసారి ఉపఎన్నికల్లో గెలిచేందుకు రఘురామ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. రఘురామపై అనర్హత వేటు వేయించేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. వైసీపీ నుంచి తనకు లభించిన ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు రఘురామకృష్ణంరాజు నిర్ణయించారు. అనంతరం ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తన రాజీనామా ఆమోదం పొందితే.. బీజేపీ తరుపున ఉపఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరేందుకు చాలా కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేసిన రఘురామకు ఇప్పుడు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. అందుకే వైసీపీకి రాజీనామా చేసి కాషాయ తీర్ఘం పుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement