కర్నూల్ బ్యూరో : కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటి కుడా చైర్మన్ గా సోమిశెట్టి వెంకటేశ్వర్లు గురువారం బాధ్యతలు స్వీకరించారు. కర్నూలు నగరంలోని కుడా కార్యాలయం నందు కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు, అభిమానుల మధ్య జిల్లా జాయింట్ కలెక్టర్, కుడా వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ బి.నవ్య సమక్ష్యంలో పదవీ బాధ్యతలను సోమిశెట్టి వెంకటేశ్వర్లు స్వీకరించారు.
ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్త్రి తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తనపై నమ్మకంతో 2వ సారి కుడా చైర్మన్ గా అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం తన పై నమ్మకంతో ఇచ్చిన పదవిని సక్రమంగా చేపట్టి వారు నాపై ఉంచిన నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా, అవినీతి అక్రమాలకు తావులేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. అక్రమ లేఅవుట్లు వేసి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే వారిని ఎవరినీ వదిలి పెట్టేది లేదన్నారు. హంద్రీ, పోరంబోకు స్థలాలో, డి లైన్ పరిధిలో కొంత మంది అక్రమ లేఅవుట్లు వేసి ప్రభుత్వ రుసుం చెల్లించకుండా మొండిచేయి చూపిస్తున్నారని, అలాంటి వారు ఏ స్థాయిలో ఉన్నా వదిలి పెట్టేది లేదన్నారు.
ఈ కార్యక్రమంలో మాజి రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేశ్, కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్, తెలుగుదేశంపార్టీ నాయకులు సోమిశెట్టి నవీన్, వై.నాగేశ్వరరావు యాదవ్, నందయల నాగేంద్ర, సోమిశెట్టి కిషోర్, ఎల్.వి.ప్రసాద్, మహేశ్ గౌడ్, పేరపోగు రాజు, పి.చిన్న మారెన్న తదితరులు పాల్గొన్నారు.