ఆంధ్రప్రభ స్మార్ట్ – శ్రీకాకుళం – మైక్రోసాఫ్ట్ లో టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు గాస్తున్నారు. ఇటు దేశ వ్యాప్తంగా కూడా పలు విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు… తన నియోజకవర్గమైన శ్రీకాకుళంలో పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ లో వచ్చిన సమస్యతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. అనుకోని సమస్యతో ఇబ్బంది వచ్చిందన్నారు.
విమానాశ్రయాల్లో వేచిచూస్తున్నవారికి ఫుడ్, మంచినీళ్లు అందించాలని.. అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరు సహనంతో ఉంటూ.. అధికారులకు సహకరించాలని కోరారు రామ్మోహన్ నాయుడు.
- Advertisement -