– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
బెంగళూరులో పనిచేస్తున్న ఓ 32 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ని అతని స్నేహితురాలు, మరో ఐదుగురు కలిసి కిడ్నాప్ చేసి దోచుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. చిక్కబళ్లాపుర జిల్లాలోని నందిహిల్స్ సమీపంలోని ఓ రిసార్ట్ కు రావాలని, నీ రాక కోసం ఎదురుచూస్తున్నామని విజయ్‌సింగ్ అనే వ్యక్తిని అతని స్నేహితురాలు బావనారెడ్డి ఆహ్వానించారు. ఇక.. అక్కడికి వెళ్లిన విజయ్సింగ్ని బావనాతో పాటు మరో ఐదుగురు వ్యక్తులు మూడు రోజులపాటు గదిలో బంధించారు. అతడి నుంచి డబ్బులు వసూలు చేసేందుకు నానా రకాలుగా చిత్రహింసలకు గురిచేశారు.
నిందితులు విజయ్‌ను చిత్రహింసలకు గురిచేసి రూ.21 లక్షల రూపాయలను వేర్వేరు అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా వారు అతని కారు, రెండు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు, బంగారు చైన్‌ని కూడా దోచుకున్నారు. ఇక.. ఎంతో నమ్మకంగా మెదిలిన భావనా, మరో ఐదుగురు కలిసి విజయ్‌ను మూడు రోజుల పాటు QVC రిసార్ట్ లోని బాత్రూమ్లోనే బందించినట్టు తెలుస్తోంది.
ఇక.. విజయ్ సింగ్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం వాసి కాగా, అతని స్నేహితురాలిగా నటించి దోపిడీకి పాల్పడ్డ యువతి భావన కూడా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రొద్దుటూరుకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. విజయ్ సింగ్ ఇచ్చిన కంప్లెయింట్ మేరకు నందిహిల్స్ పోలీసులు ఐపీసీ సెక్షన్లు 506, 341, 504, 143, 149, 384, 323, 324 కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.