Thursday, November 14, 2024

AP | మండలిలో సోష‌ల్ మీడియా ర‌చ్చ‌

  • వైసీపీ నేత‌ల అరెస్ట్ ల‌పై ఆ పార్టీ వాయిదా తీర్మానం
  • తిర‌స్క‌రించిన మండ‌లి ఛైర్మన్
  • స‌భా కార్య‌క్ర‌మాల‌ను అడ్డుకున్న వైసీపీ స‌భ్యులు
  • వి వాంట్ జ‌స్టీస్, సేవ్ డెమోక్ర‌సీ అంటూ నినాదాలు
  • వైసీపీ స‌భ్యుల తీరును త‌ప్పు పట్టిన మంత్రి నిమ్మల


అమరావతి: శాసనమండలిలో సోష‌ల్ మీడియా అరెస్ట్ లపై అధికార, విపక్షాల స‌భ్యుల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలాయి.. సోషల్‌ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారంపై చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టుబట్టగా చైర్మన్‌ అందుకు నిరాకరించారు. దీంతో.. ఎమ్మెల్సీలు చైర్మన్‌ పోడియం చుట్టుముట్టి అరగంట పాటు నినాదాలతో తమ నిరసన తెలియజేశారు.

కాగా స‌మావేశం ప్రారంభ‌మైన వెంట‌నే సోషల్ మీడియా అరెస్టులపై వైసీపీ, డీఎస్సీపై పీడీఎఫ్ వాయిదా తీర్మానం ఇచ్చాయి. అయితే చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ఆ రెండు తీర్మానాలను తిరస్కరించారు. తమ వాయిదా తీర్మానంపై చర్చించాల్సిందేనని చైర్మన్‌ను మండలిలో ప్రతిపక్ష నేత బొత్స కోరారు. అయినా అందుకు చైర్మన్‌ అంగీకరించలేదు. దీంతో పోడియం వద్దకు వచ్చి చేరిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ”వీ వాంట్ జస్టిస్..”, ”సేవ్‌ డెమోక్రసీ’.. అంటూ నినాదాలు చేశారు.

కానీ, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు మాత్రం సోషల్ మీడియా పోస్టుల ప్రతులను చైర్మన్‌కు చూపిస్తూ నినాదాలు కొనసాగించారు. చేసేది లేక ఆ నినాదాల నడుమే ఏపీ మంత్రులు మాట్లాడేందుకు యత్నించారు. ఈ క్రమంలో గందరగోళం నెలకొనగా, మండలిని కాసేపు వాయిదా వేశారు చైర్మన్‌.

- Advertisement -

అనంత‌రం తిరిగి స‌భ ప్రారంభ‌మైన‌ప్పుడు మంత్రి నిమ్మ‌ల రామానాయుడు వైసీపీ స‌భ్యుల తీరుపై మండిప‌డ్డారు.. శాసనమండలిలో ప్రజల సమస్యలపై ప్రస్తావించాల్సింది పోయి.. ఆందోళన చేస్తారా ? అని నిల‌దీశారు. జగన్‌ తల్లి, చెల్లిని.. చదవలేని భాషలో పోస్టులు పెడితే.. వారికి వత్తాసు పలుకుతారా ? అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement