నిజమాబాద్ కు చెందిన ఒకరు అరెస్ట్…
అమరావతి – ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టాడంటూ నిజామాబాద్ లో ఓ వ్యక్తిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమినిస్టర్ వంగలపూడి అనితపై అనుచిత పోస్టులు పెట్టిన మెండోరా మండలానికి చెందిన బద్దం అశోక్ రెడ్డిగా గుర్తించిన ఏపీ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని.. కూటమి సర్కార్ అపుడే విఫలమైందని బద్దం అశోక్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టులు ఇటీవల వైరల్ అయ్యాయి. ఏపీ అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా మారిందని.. శాంతిభద్రతలను పూర్తిగా గాలికొదిలేశారని పోస్టు పెట్టాడు. అక్కడి హోమంత్రి అనిత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టించుకోవడం లేదంటూ వరుసగా పోస్ట్ లు పెట్టాడు దీనిపై స్పందించిన ప్రభుత్వం పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు పోస్టులు పెట్టింది నిజామాబాద్ జిల్లాకు చెందిన బద్దం అశోక్ రెడ్డిగా గుర్తించి నిందితుడిని గత రాత్రి అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు కూడా ఎపి పోలీసులు సమాచారం ఇచ్చి విజయవాడకు తీసుకెళ్లారు..