ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని పోతవరం గ్రామం పొలాల్లో శుక్రవారం కొండచిలువ సంచారిచడం కలకలం రేపింది. పొలాల్లో సంచరిస్తున్న కొండచిలువను చూసిన రైతులు.. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారులు, స్నేక్ రెస్క్యూ సిబ్బంది అక్కడికు వెళ్లి కొండచిలువను బంధించారు. అనంతరం పొదిలి కొండ అటవీ ప్రాంతంలో వదిలారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా చిన్న చిన్న జంతువులను తింటూ గ్రామ పొలాల్లో కొండ చిలువ సంచరిస్తుందని పలువురు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement