Sunday, January 5, 2025

Tirumala | ఎర్రచందనం స్మగ్లింగ్.. ప‌ట్టుకున్న ఫారెస్ట్ అధికారులు

ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిని తిరుమల అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. తిరుమల శిలాతోరణం వ‌ద్ద‌ త‌నికీలు చేస్తున్నసమయంలో… ఓ కారు వెనుక సీటులో ఎర్రచందనం దుంగలు లభ్యమైనట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

డ్రైవర్ తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. సిబ్బంది గమనించి అదుపులోకి తీసుకున్నారు. ఎర్రచందనం దుంగలతో పాటు కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement