Tuesday, November 26, 2024

లిక్విడ్ రూపంలో గంజాయి స్మగ్లింగ్.. ప‌ట్టుకున్న‌పోలీసులు..

తిరుపతి సిటీ, ప్రభ న్యూస్ : పుత్తూరు సబ్ డివిజన్ డీఎస్పీ యశ్వంత్ రాబడిన సమాచారం మేరకు పుత్తూరు చర్చి కాంపౌండ్ లో నలుగురు వ్యక్తులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1.435. కేజీ లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని వివరించారు . అనంతపురంకు చెందిన జనుగుండా మోహన్ కృష్ణ వ్యక్తి చెన్నైకు చెందిన అజయ్ కుమార్ ప్రకాష్ లతో కలిసి ద్రవరూపం గంజాయిని విశాఖపట్నం నుంచి చెన్నై ఆ తర్వాత అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు తరలిస్తుండగా పట్టుకోడు జరిగిందని తెలియజేశారు. జను గుండ మోహన్ కృష్ణ కానిస్టేబుల్ గా పని చేస్తూ గంజాయి స్మగ్లింగ్ లో అరెస్టు కాబడి సస్పెండ్ అయ్యి జైలు శిక్ష అనుభవించి తిరిగి మళ్లీ సెట్ అభివృద్ధి కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఇతను ఇదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.

రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గంజాయి అక్రమ నిఘా పై నిఘా ఉంచడంతో పాటు గంజాయి రవాణా చేయడం సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో లిక్విడ్ రూపంలో అయితే ఎవరికి అనుమానం రాకుండా వుంటుందని సులభంగా తరించవచ్చని ఉద్దేశంతో ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. లిక్విడ్ గంజాయిని అజయ్ కుమార్ ప్రశాంత్ లోకేష్ లకు పుత్తూరు నందు వివరిస్తుండగా వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement