కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్మార్ట్ సిటీస్ మిషన్‌లో బెజవాడ ముద్ర కనిపించనుంది. ఈ మిషన్‌లో భాగంగా ఎంపికైన 47 స్మార్ట్ నగరాలకు సంబంధించిన డాక్యుమెంట్ రూపకల్పనలో ఏపీలోని విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థకు చాన్స్ లభించింది. ఈ డాక్యుమెంట్ తయారీ బాధ్యతల్లో మొత్తం 15 భారతీయ విద్యాసంస్థలకు అవకాశం దక్కగా.. వాటిలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంస్థ కూడా ఒకటి.
ఈ 15 ప్రీమియర్ సంస్థలతో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ కలిసి పనిచేయనున్నట్లు కేంద్ర గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. స్మార్ట్ నగరాల డాక్యుమెంట్ రూపకల్పనకోసం దేశంలోని 47 స్మార్ట్ నగరాలను కేంద్రం ఎంపిక చేసింది. ఈ నగరాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి కాకినాడ, విశాఖపట్నం ఉన్నాయి. డ్యాక్యుమెంట్ రూపకల్పనకు ఎంపికైన విద్యాసంస్థల నుంచి విద్యార్థుల బృందాలు, మార్గదర్శకులతో కలిసి 47 స్మార్ట్ నగరాలను సందర్శించి, జూన్ నాటికి డాక్యుమెంట్ రూపొందిస్తారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital