Railways: రవాణా రంగంలో అతిపెద్ద వ్యవస్థ రైల్వే శాఖనే అని చెప్పాలి. రోజు లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంది. రైల్వే శాఖ ఎయిర్ కండీషన్డ్ త్రీ టైర్ఎకానమీ క్లాస్ కోచ్‌లను ప్రారంభించింది. అక్టోబర్ 29 నుంచి ఆనంద్ విహార్ టెర్మినల్, పాట్నా జంక్షన్ మధ్య గతి శక్తి సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు ప్రారంభమయ్యింది. ఈ గతిశక్తి ఎక్స్‌ప్రెస్ మొదటిసారి నూతనంగా ప్రవేశపెట్టిన ఎసీ-3 టైర్ ఎకనామి కోచ్‌లతో ఉంటుంది.
ఈ రైలు నవంబర్ 7 వరకు మొత్తం ఐదు ట్రిప్పులు చేయనుంది. రైలు ప్రయాణికుల సౌకర్యార్థం, అలాగే పండగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నార్త్ రైల్వే పాట్నా- ఆనంద్ విహార్ టెర్మినల్ గతి శక్తి సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలును నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
గతి శక్తి ఎక్స్‌ప్రెస్ సమయాలు..
నార్త్ రైల్వే వివరాల ప్రకారం.. 01684 ప్రత్యేక రైలు ఆనంద్ విహార్ టెర్మినల్ – పాట్నా జంక్షన్ గతి శక్తి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి అక్టోబర్ 29న, 31న, నవంబర్ 2న, 5న మరియు నవంబర్7వ తేదీల్లో రాత్రి 11.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.45 గంటలకు పాట్నా జంక్షన్‌కు చేరుకుంటుంది.
ఇక తిరుగు ప్రయణంలో 01683 గతి శక్తి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పాట్నా జంక్షన్ నుంచి అక్టోబర్ 30, నవంబర్ 1, 3, 6, 8వ తేదీల్లో సాయంత్రం 5.45 గంటలకు బయలుదేరుతుంది. ఆనంద్ విహార్ టెర్మినల్ వద్దకు 9.50కి చేరుకుంటుంది.
గతి శక్తి ప్రత్యేక రైలు ఎకనామీ ఏసీ త్రీ టైర్ కోచ్‌లుంటాయి. ఇది కాన్పూర్ సెంట్రల్, ప్రయాగ్‌రాజ్ జంక్షన్, వారణాసి, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, దానాపూర్ స్టేషన్‌లలో ఆగుతుంది. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్- జైపూర్, ప్రయాగ్‌రాజ్ – జైపూర్, ప్రయాగ్‌రాజ్- ఉదంపూర్ ఎక్స్‌ప్రెస్ ఏసీ త్రీటైర్ ఎకానమీ కోచ్‌లను నడుపుతోంది.
ప్రపంచంలోకెల్లా అత్యంత తక్కు ధరతో, ఉత్తమమైన ఏసీ ప్రయాణాన్ని అందించాలనే ఉద్దేశంతో దీన్ని రైల్వే సంస్థ ప్రారంభించింది. ఈ కోచ్‌లలో చార్జీలు ఏసీ త్రీ-టైర్, నాన్- ఏసీ స్లీపర్ క్లాస్ మధ్య ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఇది రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సిఎఫ్) చేత రూపొందించబడింది.
సాధారణ టైర్ కోచ్‌ల కంటే 8 శాతం తక్కువగా ఎకనమీ ఏసీ-3 చార్జీలు ఉంటాయి. అయితే డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో త్వరలో మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఏ జోన్‌కైనా కనీసం 16 నుంచి 18 కోచ్‌లు అవసరమని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ కోచ్‌లను సెప్టెంబర్‌లో అనేక రైళ్లను జొడించినా.. ఇక మరిన్ని రైళ్లను నడపనుంది.