ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధికంగా స్కోచ్ అవార్డులు వచ్చాయి. స్కోచ్ గ్రూప్ 78వ ఎడిషన్‌లో భాగంగా జాతీయ స్థాయిలో ప్రకటించిన అవార్డుల్లో దేశంలోనే అత్యధిక అవార్డులు ఏపీని వరించాయి. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 113 నామినేషన్స్ రాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేటగిరిలలో ఐదు గోల్డ్, ఐదు సిల్వర్ స్కోచ్ అవార్డులు దక్కాయి. ఢిల్లీలో నిర్వహించిన వెబినార్‌లో స్కోచ్ గ్రూప్ ఎండీ గురుషరన్‌దంజల్ ఈ అవార్డులను ప్రకటించారు.
కాగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైఎస్సార్ చేయూత, ఆసరా, నేతన్ననేస్తం పథకాలతో పాటు ఫిష్ ఆంధ్ర కార్యక్రమానికి, గిరిజన ప్రాంతాల్లో బలవర్ధకమైన ఆహారాన్ని సాగుచేస్తోన్న విజయనగరం జిల్లాకు గోల్డ్ స్కోచ్ అవార్డులు దక్కాయి. ఈ-ఫిష్, పశుసంరక్షక్, ఏపీ సీడ్స్, సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్తున్న గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు, బయోవిలేజ్ విభాగంలో విజయనగరం జిల్లాకు సిల్వర్ స్కోచ్ అవార్డులు దక్కాయి. ఈ అవార్డులను వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ సీడ్స్ ఎండీ గెడ్డం శేఖర్‌బాబు, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్.అమరేంద్రకుమార్, సెర్ప్ సీఈవో ఇంతియాజ్‌లతో పాటు విజయనగరం, అనంతపురం జిల్లా కలెక్టర్లు అందుకున్నారు. ఏపీకి ఇన్ని అవార్డులు రావడంపై అవార్డులు అందుకున్న అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital