Friday, November 22, 2024

Skill Scam: చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవెలప్‌మెంట్ స్కాం కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ మేరకు జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్‌ ధర్మాసనం సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది.

అయితే ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ మంజూరులో తమ వాదనలు, ఆధారాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సీఐడీ కోర్టుకు అందజేసిన పిటిషన్‌లో తెలిపింది. ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని వాదనను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో వెంటనే చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ కోరుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement