అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కౌంటర్ వాదనలు వినిపించారు.
చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ తరపున అదనపు ఏజీ పొన్నవోలు వాదించారు.ఆరోగ్యానికి సంబంధించి తప్పుడు నివేదికలు ఇచ్చారని వాదించారు. పొన్నవోలు వాదనలపై చంద్రబాబు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురి వాదనలు ముగియడంతో.. ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.