Monday, November 18, 2024

Skill Case : చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ జనవరి 19కి వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇవాళ విచారించిన‌ సుప్రీంకోర్టు తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. నేటి విచారణలో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. తాము కౌంటర్ దాఖలుకు సిద్ధంగానే ఉన్నామని తెలిపారు.

ఈ కేసు వ్యవహారం 17ఏ తీర్పుతో ముడిపడి ఉందన్న విషయాన్ని సాల్వే ప్రస్తావించారు. చంద్రబాబుకు ధర్మాసనం గతంలో నోటీసులు ఇచ్చినా ఇంకా కౌంటర్ వేయలేదని సీఐడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు ముగిసిన అనంతరం సుప్రీంకోర్టు ధర్మాసనం స్పందిస్తూ… దీనిపై విచారణను జనవరి మూడో వారంలో చేపడతామని తెలిపింది. దాంతో, తేదీ ఖరారు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు విన్నవించారు. సాల్వే విజ్ఞప్తితో విచారణను జనవరి 19కి వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement