రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి రెండో రోజు సీఐడీ విచారణ మొదలైంది. మొదటి రోజు మాదిరిగానే ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలుత సీఐడీ అధికారుల బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకి చేరుకుంది. కోర్ట్ ఆదేశాల ప్రకారం విచారణకు ముందు చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులో చంద్రబాబును సీఐడీ అధికారులు ప్రశ్నించడం మొదలుపెట్టారు. చంద్రబాబు తరపున ఇద్దరు న్యాయవాదులు విచారణలో పాల్గొన్నారు. ఉదయం 10.30కి అయిదు నిమిషాలు విరామం ఇచ్చారు.. అనంతరం అధికారులు విచారణను కొనసాగిస్తున్నారు. ఇదిలావుండగా నేటితో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుంది. సాయంత్రం విచారణ అనంతరం అధికారులు వర్చువల్‌గా జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు.
Skill Case – రెండో రోజూ కొనసాగుతున్న చంద్రబాబు సిఐడి కస్టడీ విచారణ..
Advertisement
తాజా వార్తలు
Advertisement