స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎన్నికలకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబుకు సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. హోలీ సెలవుల తర్వాత పిటిషన్ పై విచారణ జరుపుతామని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఏప్రిల్ 16కి తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.
అధికారులు, దర్యాప్తు సంస్థను చంద్రబాబు కుటుంబ సభ్యులు బెదిరిస్తున్నారని ఏపీ సీఐడీ తన పిటిషన్ లో పేర్కొంది. రెడ్ డైరీలో అధికారుల పేర్లు నమోదు చేస్తున్నామంటూ బెదిరిస్తున్నారని తెలిపింది. ఎన్నికలకు ముందు పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేయడం చంద్రబాబుకు ఊరటగానే చెప్పుకోవచ్చు.