Tuesday, November 26, 2024

Skill Case – చంద్రబాబు క్వాష్ పిటిష‌న్ పై రేపు సుప్రీంలో విచారణ

న్యూ ఢిల్లీ – స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ సంస్థ కేసులో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్‌ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ రేపు విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. ఈ పిటిషన్‌ ఏ బెంచ్‌ ముందు విచారణకు వస్తుందో సాయంత్రానికి వెల్లడికానుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇదే విష‌యంపై చంద్ర‌బాబు వేసిన క్వాష్ ప‌టిష‌న్ ను హైకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును స‌వాల్ చేస్తూ చంద్ర‌బాబు న్యాయ‌వాదులు సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు.. దీనిపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement