అమరావతి: స్కిల్ డెవల్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణ అక్టోబర్ మూడో తేదికి వాయిదా పడింది.. హైకోర్టులో ఈ పిటిషన్ పై ప్రభుత్వ తరుపున ఎజి శ్రీరామ్ వాదనలు వినిపించారు.. అంతకు ముందు చంద్రబాబు తరుపున సిద్ధార్థ లూద్రా తన వాదనలను కోర్టు దృష్టి తెచ్చారు.. అనంతరం విచారణను వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు..
ఇది ఇలాఉంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా, సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను అక్టోబరు 3కు వాయిదా వేసింది.