Tuesday, November 26, 2024

Skill, Fiber Net Cases – చంద్రబాబు క్వాష్‌, ఫైబర్ నెట్ పిటిషన్‌ లపై సుప్రీంలో విచారణ వాయిదా

ఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. స్కిల్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టింది. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు వినిపిస్తూ, “స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేశారు.. ఆయనకు అనేక కేసులను అంటకడుతూ ఇబ్బంది పెడుతున్నారు.. ఫైబర్‌ నెట్‌లోనూ చంద్రబాబుకు 17A చట్టం వర్తిస్తుంది. ” అని వివరించారు. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్‌ లూథ్రా వాదనలు ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

ఇదిలా ఉంటే ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఎఫ్ఐఆర్ రద్దు చేయాలన్న అంశంపై ఎంసీ గుప్తా కేసును రోహత్గీ ప్రస్తావించారు.చట్టం అమల్లో ఉన్నప్పుడు జరిగే నేరాలకు అదే చట్టం వర్తిస్తుందని రోహత్గీ వాదించారు.చట్టం రద్దు చేసినా.. వెనక్కి తీసుకున్నప్పుడు నేరం జరిగినప్పటి చట్టమే వర్తిస్తుందని రోహత్గీ వాదించారు. కొత్త చట్టం అమల్లోకి రాకముందే నేరం జరిగినందున సవరణ చట్టం ఈ కేసుకు వర్తించదని రోహత్గీ అత్యున్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.

- Advertisement -

ఇదిలా ఉండగా.. ఫైబర్‌నెట్‌ కేసులోనూ చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. చంద్రబాబు తరఫు లాయర్‌ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ.. ఫైబర్‌ నెట్‌ కేసులో ముగ్గురికి ముందస్తు బెయిల్ వచ్చిందన్నారు. ఇద్దరికి రెగ్యులర్‌ బెయిల్‌ వచ్చిందని, మరికొంతమంది ప్రస్తావన లేదన్నారు. కొందరికి ముందస్తు బెయిల్‌, మరి కొంతమందికి రెగ్యులర్‌ బెయిల్‌ ఉన్నప్పుడు చంద్రబాబుకు బెయిల్‌ ఎందుకివ్వరని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు మంగళవారం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement