Tuesday, November 26, 2024

Skill case – అక్టోబర్ ఐదు వరకు చంద్ర బాబు రిమాండ్ పొడిగింపు

అమరావతి: నారా చంద్రబాబునాయుడు రిమాండ్ గడువును ఏసీబీ న్యాయస్థానం మరో 11రోజులు పొడిగించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు వారాల క్రితం అరెస్ట్ చేసింది . నేటితో రిమాండ్ ముగియడంతో వర్చువల్గా ఏసీబీ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. దీంతో న్యాయమూర్తి ఆయన రిమాండ్ను అక్టోబర్ 5వ తేదీ వరకు అంటే మరో 11 రోజులు పొడిగించారు .

జ్యుడీషియల్ రిమాండ్, కస్టడీ ముగియడంతో జైలు అధికారులు చంద్రబాబును వర్చువల్ గా (వీడియో కాన్ఫరెన్స్) న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో న్యాయమూర్తి 2 నిమిషాలు మాట్లాడారు. పలు ప్రశ్నలు అడిగారు. విచారణ సమయంలో సీఐడీ అధికారులు మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టారా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? వైద్య పరీక్షలు నిర్వహించారా? అని చంద్రబాబుని అడిగారు జడ్జి. దీనికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. తనను అధికారులు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని, గైడ్ లైన్స్ ఫాలో అయ్యారని, వైద్య పరీక్షలు చేశారని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక, బెయిల్ పిటిషన్ పై సోమవారం వాదనలు వింటామని చంద్రబాబుతో చెప్పారు న్యాయమూర్తి

ఈ కేసులో చంద్రబాబును సీఐడీ రెండు రోజుల పాటు తమ కస్టడీకి తీసుకొని విచారించింది. కస్టడీ కూడా ఈరోజు ముగియడంతో ఈ కేసులో మరిన్ని వివరాల రాబట్టేందుకు మరికొన్ని రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ కోరింది. చంద్రబాబును రెండురోజుల పాటు 12 గంటలకు పైగా విచారించిన సీఐడీ 120 ప్రశ్నలు సంధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement