Friday, November 22, 2024

Skill Case – చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ పై సస్పెన్షన్ వేటు

అమ‌రావ‌తి – మాజీ ముఖ్య‌మంత్రి,టిడిపి అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్ వేటు పడింది. ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు అతిక్రమించినందుకు చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి. ప్రస్తుతం ప్లానింగ్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తన్నారు. స్కిల్ కుంభకోణం, చంద్రబాబు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాస్. కీలకంగా ఉన్నారు శ్రీనివాస్. శ్రీనివాస్ ద్వారానే చంద్రబాబు కు నిధులు చేరాయి అని సీఐడీ అభియోగం మోపిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా వెళ్లి శ్రీనివాస్ అక్కడే ఉంటున్నారు. ఇలాంటి తరుణంలోనే ప్రభుత్వ సర్వీస్ నిబంధనలు అతిక్రమించినందుకు చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ సస్పెన్షన్ వేటు పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement