తిరుమల లో ఆరో చిరుత బోనులో పడింది. చిన్నారి లక్షితపై దాడి చేసిన ప్రాంతంలోనే ఈ చిరుత చిక్కింది. గత కొన్ని రోజులుగా చిరుత సంచారాన్ని గుర్తించి, అధికారులు బోనులు ఏర్పాట్లు చేశారు.అందులో స్వామి వారి ఆలయానికి వెళ్లే నడకదారిలో ఉంచిన దాంట్లో బుధవారం తెల్లవారుజామున చిరుత చిక్కుకుంది.
కాగా.. ఈ చిరుతను జూపార్క్ లో వదిలిపెట్టాలని అధికారులు నిర్ణయించారు. దీని కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తిరుమల అటవీ ప్రాంతంలో ఇప్పటి వరకు అధికారులు ఆరు చిరుతలను పట్టుకున్నారు. బుధవారం పట్టుబడిన చిరుతతో ఆ సంఖ్య ఆరుకు చేరింది..
గత గురువారం తిరుమల అలిపిరి నడకమార్గంలో ఐదో చిరుతను గురువారం అటవీశాఖ అధికారులు బంధించారు. నరసింహస్వామి ఆలయం, ఏడవకు మైలు రాయి మధ్యలో అటవీశాఖ అధికారులు చిరుతను ట్రాప్ చేశారు. నాలుగు రోజుల క్రితమే ట్రాప్ కెమెరాకు చిక్కిన చిరుత కోసం బోన్లు ఏర్పాటు చేశారు. ఈ బోన్లో చిరుత చిక్కింది. అయితే సెప్టెంబర్ 7న నాలుగో చిరుత చిక్కింది