Tuesday, September 17, 2024

Sixth Day – వ‌ర‌ద స‌హాయ చ‌ర్య‌ల‌పై చంద్ర‌బాబు సమీక్ష‌…

బుడ‌మేరు మూడో గండి పూడ్చివేత‌లో ఆర్మీ సిబ్బంది
పారిశుద్యం ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని పిలుపు
నిత్యావ‌స‌రాలు అంద‌రికీ అందాల‌ని ఆదేశం
మెకానిక్లను, టెక్నీషియన్లను ఇత‌ర ప్రాంతాల నుంచి ర‌ప్పించాలి
రెండు రోజ‌లుల‌లో మొత్తం చ‌క్క‌బ‌డాలి
ఏ చిన్న ఫిర్యాదు వ‌చ్చిన యాక్ష‌న్ క‌ఠికంగా ఉంటుంది..

విజయవాడలో ఆరవ రోజు వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా వరద ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను సీఎంకు అధికారులు వివరించారు.
ఫైరింజన్లతో రోడ్లు, కాలనీలు, ఇళ్లు క్లీనింగ్ ను మరింత వేగవంతం చేయాలని చంద్రబాబు సూచించారు. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చివేత పనుల ప్రోగ్రెస్ ను అడిగి తెలుసుకున్నారు. అలాగే, బుడమేరు వాగుకు గండ్లుపూడ్చి వేత కార్యక్రమంలో రంగంలోకి దిగిన భారత ఆర్మీకి చెందిన ఇంజనీరింగ్ టాస్క్ ఫోర్స్ విభాగం.. యద్ద ప్రాతిపదికన పనులు చేపట్టి.. ఇప్పటికే రెండు గండ్లు పూడ్చినట్లు సీఎం కు అధికారులు తెలిపారు.

- Advertisement -

మూడో గండి పూడ్చివేత‌లో ఆర్మీ…

ఇక, అత్యంత క్లిష్టంగా ఉన్న మూడో గండి పూడ్చివేత పనులను ఆర్మీ అధికారుల సహకారంతో వేగంగా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అధికారులు తెలిపారు. అన్ని విభాగాల సమన్వయంతో మూడో గండి పూడ్చివేత పనులు త్వరగా పూర్తి చేయలన్నారు. కరెంట్ సరఫరా, టెలిఫోన్ సిగ్నల్స్ పునరుద్దరణ, ట్యాంకర్లతో తాగునీటి సరఫరా వివరాలు తెలుసుకున్నారు.

అందరికీ నిత్యావ‌స‌రాలు అందాలి..

నిత్యావసరాతో కూడిన ఆరు వస్తువుల పంపిణీపైనా కూడా ఆయన సమీక్ష చేశారు. ఇప్పటికే ప్యాకింగ్ పూర్తి చేసి బాధితులకు అందిస్తున్నట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. వాహనాలు, ఇళ్లల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు దెబ్బతిన్న నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి టెక్నీషియన్ల ను పిలిపించాలని సీఎం సూచించారు. అవసరం అయితే కొంత పారితోషికం ఇచ్చి అయినా మెకానిక్లను, టెక్నీషియన్లను ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement