Friday, November 22, 2024

ఆరేళ్ల చిన్నోడు.. రోడ్డు ఇష్యూపై పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్‌

ఆరు సంవ‌త్స‌రాల వయసులో బడికి వెళ్లి చ‌దువుకోవ‌డ‌మో.. ఇంట్లో, తోటి పిల్ల‌ల‌తో ఆడుకోవ‌డ‌మో చేస్తుంటారు చాలామంది. కానీ ఈ చిన్నోడు కాస్త డిఫ‌రెంట్‌. త‌మ స్కూల్ ముందు రోడ్డు అడ్డ‌దిడ్డంగా త‌వ్వేసి, అది పూడ్చ‌కుండా ఇబ్బందిలు తెచ్చిపెట్టార‌ని ఏకంగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాడు. ఇది చిత్తూరు జిల్లాలో జిర‌గింది. ఆరేళ్ల వయసులో ఇంత పెద్ద ఘనకార్యం చేశాడంటే నిజంగానే న‌మ్మాలి. ఎక్కడ పడితే అక్కడ రోడ్లను తవ్వడాన్ని తప్పుబడుతూ ప్రభుత్వాన్నే ప్రశ్నించేస్థాయికి వెళ్లాడు బుడతడు.

చిత్తూరు జిల్లా పలమనేరులో తాను చదువుతున్న స్కూల్ ముందు రోడ్డును జేసీబీలతో ఇష్టారాజ్యంగా తవ్వేసారు. ఆ తర్వాత గుంతలను పూడ్చలేదు. దీంతో తవ్వేసిన చోట కొందరు అడ్డదిడ్డంగా వాహనాలను ఆపేస్తున్నారు. దీంతో ఆ చిన్నోడికి కోపం వచ్చింది. అడ్డంగా వాహనాలు ఆపే వారిని ముందుగా నిలదీశాడు. అంతేకాకుండా ఏకంగా పోలీస్ స్టేషనుకు వెళ్లి సీఐకి కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో సీఐ భాస్కర్ తాము వచ్చి ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తామని ఆ చిన్నోడికి న‌చ్చ‌జెప్పాడు. స్వీట్ తినిపించిన మ‌రీ తన ఫోన్ నెంబర్ ఆ చిన్నోడు కార్తికేయ‌కు ఇచ్చాడు సీఐ భాస్క‌ర్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement