Thursday, November 21, 2024

వందే భార‌త్ పై రాళ్ల దాడి – అరుగురి అరెస్ట్ …

ఎన్టీఆర్‌,ప్రభన్యూస్‌బ్యూరో: కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారై పరుగులు పెడుతున్న వందే భారత్‌ రైళ్లపై ఇటీ-వల జరుగుతున్న దాడులకు అధికారులు గట్టిగానే స్పందించారు. వరుసగా వందే భారత్‌ రైళ్లపై జరుగుతున్న దాడులను సీరియస్గా తీసుకున్న రైల్వే ప్రొ-టె-క్షన్‌ పోలీసులు క్షుణ్ణంగా ఎంక్వయిరీ చేస్తున్నారు. ఏప్రిల్‌ 28వ తేదీన సామర్లకోట పిఠాపురం స్టేషన్ల మధ్య వందే భారత్‌ ఎక్సెస్ర్‌ పై రాళ్లతో దాడులకు పాల్పడిన యువకులను గుర్తించారు. హైదరాబాదు నుండి విశాఖపట్నం వెళ్తున్న వందే భారత్‌ ఎక్సెస్ర్‌ ఆరుగురు యువకులు రాళ్లతో దాడి చేసిన కారణంగా మర మ్మత్తులు నిర్వహణ కారణంగా ఎక్సెస్ర్‌ రైలును నాలుగు గంటల పాటు- రీ షెడ్యూల్‌ చేయబడింది. దీంతో ఇటు- ప్రయాణికులకు అటు- రైల్వే సమయాపాలనపై తీవ్ర ప్రభావం పడింది. ఈ దాడి ఘటనను అత్యంత సీరియస్గా తీసుకున్న రైల్వే ప్రొ-టె
-క్షన్‌ ఫోర్స్‌ అధికారులు రాజమండ్రి సామర్లకోట వెళ్లి విచారణ జరిపి హనుమాన్తో ప్రదేశాల్లో విచారించారు

అయినప్పటికీ ఫలితం రాకపోవడంతో పొందే భారత్‌ రైల్లో ఏర్పాటు- చేసిన సీసీ కెమెరాలను ఆన్‌ బోర్డ్‌ సిసి ఫుటేజీని పూర్తిస్థాయిలో పరిశీలించారు. పిఠాపురం సామర్లకోట రైల్వే లైన్‌ మధ్యలో ఆరుగురు యువకులు ఉన్నట్లు- కనుగొన్నారు. ఆ ప్రదేశానికి దారి తీసిన అప్రోచ్‌ రోడ్‌ లో గల స్థానికులను విచారించి అనుమాతిని అనుమానితులను గుర్తించారు. పూర్తిస్థాయిలో విచారణ చేయగా దాడికి సంబంధించిన ఆరుగురు యువకులను గుర్తించి వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురుపై రైల్వే చట్టంలోని సెక్షన్‌ 153 కింద కేసు నమోదు చేసి వారిని విజయవాడలోని రైల్వే కోర్టుకు హాజరు పరిచారు. ఆర్పీ ఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆరుగురిలో ముగ్గురు చిన్నారులు కాగా వారిని రాజమండ్రిలోని జువైనల్‌ కోర్టుకు హాజరు పరిచారు తదుపరిచర్ల కోసం జువైనల్‌ హోమ్‌ కు తరలించారు మిగతా ముగ్గురిని జ్యుడీషియల్‌ రిమాండ్‌ కి తర లించారు.

విజయవాడ డివిజన్‌ సీనియర్‌ డిఎస్సి వల్లేశ్వర బాబుజి రాజమండ్రి ఐపీఎఫ్‌ అధికారి సైదయ్య బృందం ఈ కేసును శోధించి దాడికి పాల్పడున వారిని పట్టు-కోవడం పట్ల రైల్వే వర్గాలు ఆనందం వ్యక్తం చేసే వారిని అభినందించారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ సురేంద్రమోహన్‌ మాట్లాడుతూ రైళ్లపై రాళ్లు రావడం చట్టరీత్యా నేరమని నేరస్థలపై రైల్వే చట్టంలో కఠిన శిక్షలు విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రజా ఆస్తులను నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రయాణికుల భద్రతా మరియు రైళ్ల సమయపాలన అత్యంత ప్రాధాన్యతని ఇస్తున్నామని ఆయన ఎలాంటి సంఘ టన-కై-నా రాజీపడబోమని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement