వీరికి పలు నేరాలతో సంబంధాలు
మావోయిస్టులపై రివార్డుల ప్రకటన
వీరంతా దళంలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న వ్యక్తులు
అనేక ఘటన ల్లో కీలక పాత్ర
మావోయిస్టులు జన స్రవంతిలో కలవాలని డీఐజీ విశాల్ గున్ని పిలుపు
విశాఖ క్రైం, ప్రభ న్యూస్ : నిషేధిత (సిపిఐ) మావోయిస్టు దళానికి ఆరుగురు కీలక వ్యక్తులు విశాఖ పోలీసులకు లొంగిపోయారు.
వీరంతా దళంలో వివిధ స్థాయిల్లో కీలక వ్యక్తులుగా పనిచేస్తున్నారు. వీరిపై పలు రివార్డుల ప్రకటన కూడా ఉంది. విశాఖ రేంజ్
డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి కార్యాలయంలో సౌత్ బస్తర్ డివిజన్ (ఎస్ బి టి డి వి సి) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ( డి కె ఎస్ జెడ్ ఓ ఓ) ప్రాంతంలో పనిచేస్తున్న ఈ ఆరుగురు అజ్ఞాత మావోయిస్టులు (యుజి క్యాడర్) డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని, అల్లూరి సీతారామరాజు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ సిన్హా ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయారు.
లొంగిపోయిన మావోయిస్టుల వివరాలు..
కుహరం మిథిలేష్ అలియాస్ రాజు(37) డివిజనల్ కమిటీ సభ్యుడు, కిస్టారం ఏరియా కమిటీ సెక్రెటరీ. బరసి మాసా(30) ఏరియా కమిటీ సభ్యుడు. వెట్టి భీమా (32) ఏరియా కమిటీ సభ్యుడు గా కొంట ఏరియా కమిటీ లో పనిచేశాడు. పాలమడుగు గ్రామానికి చెందిన వంజమ్ రామే అలియాస్ (28) జనతన సర్కార్ ఏరియా కమిటీ సభ్యురాలుగా కిస్టారం ఏరియా కమిటీలో పని చేశారు. ఈసందర్భంగా డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విశాల్ గున్ని, అల్లూరి సీతారామరాజు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ సిన్హా మాట్లాడుతూ… మావోయిస్టులు అజ్ఞాతం వీడి జన స్రవంతిలో కలవాలన్నారు. తాము చేస్తున్న పనుల వల్ల అటు ప్రభుత్వ ఆస్తులకే గాక ప్రజలకు కూడా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో తమ డిమాండ్ల సాధన కోసం న్యాయపరంగా పోరాటం చేయాలని తెలిపారు.