సీఎం చంద్రబాబుతో సివేరి సోమ కుటుంబం భేటీ
2019లోని మావోయిస్టుల చేతిలో మాజీ ఎమ్మెల్యే సోమ హత్య
అప్పట్లోనే కుటుంబాన్ని ఆదుకుంటామన్న చంద్రబాబు
ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతిప్రతినిధి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మావోయిస్టుల చేతిలో హతమైన అరకు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ కుటుంబ సభ్యులు శుక్రవారం భేటీ అయ్యారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని అరకు లో 2019వ సంవత్సరం సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమ భార్య ఇచ్చావతి యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు సోమ కుమారుడి చదువు బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. మీకు ఎల్లప్పుడు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కాన్వాయ్ ఆపి… వినతుల స్వీకరణ
ఆంధ్రప్రభ స్మార్ట్ – అమరావతిప్రతినిధి : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రజలను చూస్తే కాన్వాయ్ ఆపి ప్రజల క్షేమాలను అడిగి తెలుసుకుంటూ ప్రజల మనిషిగా ముద్రపడుతున్నారు. సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్తూ అక్కడ వేచి ఉన్న ప్రజలను చూసి తన కాన్వాయ్ ను ఆపారు. అక్కడి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. యోగక్షేమాలను అడిగి తెలుసుకుని వినతులను స్వీకరించారు. వైకాపా గూండాల దాడిలో సర్వస్వం కోల్పోయానని ఆదుకోవాలని సీఎంను అరకు సర్పంచ్ శ్రీనివాస్ కోరారు. సమస్యను పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.